ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి పెద్దపీట.....ఎమ్మెల్యేపాయ ల శంకర్, మున్సిపల్ చైర్మన్బండారి అనూష సతీష్
– 49 వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు.. రూ.29 కోట్లతో పనులు పురోగతిలో .. రూ.43 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి – మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈరోజు పట్టణంలోని వార్డు నంబర్ 3, జీఎస్ స్టేట్ తిరుపల్లి ప్రాంతంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానిక కౌన్సిలర్ ఆదిత్య ఖండేష్కర్ లతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ..
ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, పారిశుధ్యం తదితర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం పట్టణంలో సుమారు రూ.29 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.43 కోట్ల విలువైన అభివృద్ధి పనులు టెండర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ పనులు కూడా త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని మొత్తం 49 వార్డుల్లోనూ అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఏ ఒక్క వార్డును నిర్లక్ష్యం చేయకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయిస్తూ ప్రజలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ధ్యేయమని అన్నారు.
ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా సంబంధిత అధికారులకు సూచనలు చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలే ప్రాధాన్యతగా, ప్రతి వార్డులో అభివృద్ధి కనిపించేలా సమష్టిగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, వార్డు కౌన్సిలర్ ఆదిత్య ఖండేశ్వర్, జీఎస్ స్టేట్ సొసైటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

