పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.. చివరి వార్డు వరకు అభివృద్ధి ఫలాలు అందాలి మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ భూక్యా రాము నాయక్

పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం

బెల్లంపల్లి మంచిర్యాల:  తెలంగాణ పట్టణాల సమగ్ర అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై బెల్లంపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ భూక్యా రాము నాయక్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పట్టణాల్లో డ్రైనేజీ, తాగునీరు, రహదారుల సమస్యలు పేరుకుపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.20 వేల కోట్లతో పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమన్నారు. వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, మురుగునీటి శుద్ధి, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రాజెక్టులు భవిష్యత్తు పట్టణాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆశయాల సాధనకు రాష్ట్రంలోని కౌన్సిలర్లు, చైర్మన్లతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ ఫోరం కృషి చేస్తుందని భూక్యా రాము నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
బెల్లంపల్లి మంచిర్యాల:  తెలంగాణ పట్టణాల సమగ్ర అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై బెల్లంపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్...
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి
ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ