మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్
ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన పలక లక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలియగానే ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. 13వ వార్డు సభ్యులు ఆవుల అక్షయ లక్ష్మీనారాయణ ద్వారా విషయం తెలుసుకున్న లక్ష్మణ్ బాబు, మృతురాలి దశదిన కర్మ కార్యక్రమాల కోసం బియ్యం బస్తాలు, వంట నూనె తదితర నిత్యావసర సరుకులను పంపించారు.8 శుక్రవారం వార్డు సభ్యులు ఆవుల అక్షయ లక్ష్మీనారాయణతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మృతురాలి నివాసానికి వెళ్లి, ఆ సరుకులను కుటుంబ సభ్యులకు అందజేశారు. పలక లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


