సీసీ కెమెరాలతో నేరాలకు చెక్ పెట్టవచ్చు

ప్రతి వార్డులో కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్ పెట్టవచ్చు

మెదక్ పట్టణంలోని 21వ వార్డులో సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ మెదక్, మెదక్ పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రతి వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని 21వ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయని, నేరాలు జరిగిన తర్వాత నిందితులను గుర్తించడంతో పాటు నేరాలు జరగకుండా ముందస్తుగా అరికట్టడానికి కూడా దోహదపడతాయని తెలిపారు. పోలీసులతో పాటు ప్రజలు భాగస్వాములైనప్పుడే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, ప్రతి వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటును సామూహిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇదే తరహాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో పట్టణాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని కోరారు. 21వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన కౌన్సిలర్ పబ్బ రాజమణిని జిల్లా ఎస్పీ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి, వైస్ చైర్మన్ నరేష్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, కౌన్సిలర్ పబ్బ రాజమణి, ఇతర కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి