*ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎస్సీ విభాగం ఇన్చార్జిగా నియమితులైన దుర్గం శేఖర్‌ను సన్మానించిన డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ ను నూతనంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎస్సీ విభాగం ఇన్చార్జిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన దుర్గం శేఖర్ ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ...
కాంగ్రెస్ పార్టీ విజయాలలో దళిత, బడుగు, బలహీన వర్గాల పాత్ర ఎంతో కీలకమని, సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దళితులకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తూ రాజకీయంగా, సామాజికంగా వారి అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.
దుర్గం శేఖర్ కు పార్లమెంటరీ ఎస్సీ విభాగం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని, ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, ప్రజలతో ఉన్న అనుబంధం పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ విభాగాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన దుర్గం శేఖర్ మాట్లాడుతూ...
తనపై నమ్మకం ఉంచి ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎస్సీ విభాగం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, టీపీసీసీ నాయకత్వానికి, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామస్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
దుర్గం శేఖర్‌కు నూతన బాధ్యతలు దక్కడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ డేరా కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్, జాదవ్ రాదేశాం, ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి దేవిదాస్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, సోనియా మంథని, అదవాలి రేఖ, గంగన్న గారు, పొట్ట అశోక్, పట్టణ కాంగ్రెస్ ఎస్సి విభాగం అధ్యక్షులు చంద్రాల రాహుల్ ,ఎస్ జిల్లా ఎస్సీ విభాగం నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


