హామీ ఇచ్చారు.. ఎంపీగా వంశీని గెలిపించాం.. మంత్రి వివేక్ కార్పొరేషన్ ను అడ్డుకుంటున్నారు: నేతకాని నేతల ఆగ్రహం

హామీ ఇచ్చారు.. ఎంపీగా వంశీని గెలిపించాం.. మంత్రి వివేక్ కార్పొరేషన్ ను అడ్డుకుంటున్నారు: నేతకాని నేతల ఆగ్రహం

బెల్లంపల్లి మంచిర్యాల :  ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన నేతకాని సమాజానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేతకాని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు గోమాస సచిన్ మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మూడు లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ తమ సమాజానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని నాయకులు పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో చెన్నూరు, పెద్దపల్లి నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించినప్పటికీ అనివార్య కారణాల వల్ల దక్కలేదని, అప్పుడు ముఖ్యమంత్రి, ఎంపీ గడ్డం వంశీ నీ గెలిపిస్తే మంత్రి వివేక్ వెంకటస్వామి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తుచేశారు. ఆ నమ్మకంతోనే తమ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిందని తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కార్పొరేషన్ అంశాన్ని పక్కన పెట్టారని నాయకులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్ తదితరులు నేతకాని సమాజ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లేఖలు రాసినప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధులు వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ దీనికి అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు. నేతకాని కార్పొరేషన్‌కు బదులుగా జీవో నెంబర్ 2 ద్వారా మాల కార్పొరేషన్‌ కి ఏర్పాటుకి జిఓ తెచ్చారు. ఉపకులంగా చేర్చడం తమ సమాజాన్ని రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు తమ వైఖరిని మార్చుకుని వెంటనే నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో నేతకాని ఆగ్రహాన్ని తగిన చూడవలసి వస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ వివేక్ వెంకట స్వామి అడ్డుకుంటున్నారు. తక్షణమే దీనిపై ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు దుర్గం సోమయ్య మాజీ జడ్పీటీసీ, గట్టు భానేష్, శివలింగం, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి