గ్రంథాలయ వారోత్సవాల్లో సత్తా చాటిన సెయింట్ ఆంథోనీస్ విద్యార్థులు

ప్రతిభకు నిలయంగా సెయింట్ ఆంథోనీస్ పాఠశాల

గ్రంథాలయ వారోత్సవాల్లో సత్తా చాటిన సెయింట్ ఆంథోనీస్ విద్యార్థులు

చదువులోనే కాదు, కళలు, సృజనాత్మక పోటీల్లోనూ సెయింట్ ఆంథోనీస్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ములుగు గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఈ పాఠశాల విద్యార్థులు పలు బహుమతులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మ్యూజికల్ చైర్ పోటీలో సుమయ మొదటి బహుమతి, ఫారిక్ రెండవ బహుమతి, చింతల సాయి రిషిత మూడో బహుమతి సాధించారు. రంగోలి పోటీలో అలోకిత, అంశు, ఐశ్వర్య, అక్షయ, హన్శ్వి మొదటి బహుమతి అందుకున్నారు. వ్యాసరచనలో బానోత్ కార్తిక్ మూడవ బహుమతి, చిత్రలేఖనంలో పోరిక శాన్విత ద్వితీయ బహుమతి సాధించారు. విద్యార్థులను అభినందిస్తూ గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచంద్ర, మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ చదువుతో పాటు కళలపై మక్కువ పెంచుకోవాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ యారవ కవితా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే తమ లక్ష్యమని తెలిపారు. హెడ్మాస్టర్ కందాల రమేష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతి పోటీలో బహుమతులు సాధించి పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారని అన్నారు. పాఠశాల డైరెక్టర్లు బొల్లం రవి, సాని కొమ్ము వెంకటప్ప రెడ్డి, ఏళ్ల మధుసూదన్, యారవ సాయి కిరణ్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి