ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మమేకమైన ప్రభుత్వ సలహా దారు..సుదర్శన్ రెడ్డి
పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై చర్చలు
ఆదిలాబాద్, : చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు, భైంసా నియోజకవర్గ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డికి కూడా నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులు చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై అభిప్రాయాలు పంచుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్‌చార్జి గౌలి సంజీవ్, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


