మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
గంభీరావుపేట మండల కేంద్రంలోని దోషాలగూడెం కాలనీకి చెందిన కడారి సురేష్ వయసు 30 సంవత్సరాల గల వ్యక్తి మద్యం కు బానిస అయి గ్రామంలో తిరుగుతుండేవాడు, తనకు ఫిట్స్ కూడా వస్తుంది అని శనివారం ఉదయం 10:30 గంటలకు గంభీరావుపేట గ్రామానికి చెందిన దండు చంద్రం అను అతను మృతుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన వ్యవసాయ పొలంలో మీ చిన్న కొడుకు కడారి సురేష్ బోర్లా పడి చనిపోయి ఉన్నాడు అని తెలుపగా వెంటనే మృతుని తల్లిదండ్రులు దండు చంద్ర పొలం వద్దకు పోయి చూడగా బురద నీటిలో బోర్లా పడి ఊపిరి ఆడక చనిపోయి ఉన్నాడు అని పోలీస్ స్టేషన్లో మృతుని తల్లిదండ్రులు గత కొంతకాలంగా నా చిన్న కొడుకు కడారి సురేష్ మద్యం తాగడానికి అలవాటు పడి మద్యం మత్తులో నడుస్తూ రాగా ఫిట్స్ వచ్చి కాలుజారి ప్రమాదవశాత్తు పొలంలో పడి బురద నీటిలో ఊపిరి ఆడక చనిపోయినాడు. నా కొడుకు మరణం పై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదు అని ఫిర్యాదు చేశారు. ఇటి కేసు నమోదు చేసిన ఎస్సై ఆర్. బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


