తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి

గుర్తింపు కమిటీ సమావేశంలో నిర్ణయం

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి

హుస్నాబాద్ :  మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కే.కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి , శ్యాం మోహన్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ ఇప్పటికే వివిధ యూనివర్సిటీల ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన పనుల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. గుర్తింపు ప్రక్రియలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు, వాటి పురోగతిపై కమిటీ సభ్యులు చర్చించారు.ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటు చేయనున్న వెబ్‌సైట్ ప్రస్తుత స్థితి, ఎప్పటిలోగా ప్రారంభించాలి, వెబ్‌సైట్ ఏర్పాటును వేగవంతంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన వెబ్‌సైట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. వెబ్‌సైట్ ఏర్పాటుపై తదుపరి పురోగతిని త్వరలోనే మరోసారి సమీక్షించి, వెబ్‌సైట్ ప్రారంభం, తదుపరి కార్యాచరణపై మరో ప్రకటన చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి