ఆదిలాబాద్ పట్టణం లోని కేసీబీ గార్డెన్ లో ఘనంగా వివాహ వేడుక - నూతన వధూవరులను ఆశీర్వదించిన అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి*
కంది శ్రీనన్న పెళ్లి కానుక అందజేత - వధూవరులకు శుభాకాంక్షలు*
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ పట్టణంలోని కేసీబీ గార్డెన్ లో జరిగిన వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. నేహా వెడ్స్ కళ్యాణి గార్ల వివాహ వేడుకకు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సంతోషంగా, సుఖంగా, అన్యోన్యంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం కంది శ్రీనన్న పెళ్లి కానుకను బహుకరించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వివాహ వేదికకు చేరుకోగానే బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వధూవరుల కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి వేడుకల్లో అందరితో కలివిడిగా ఉంటూ, ఆప్యాయంగా పలకరించడం కంది శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకత. ఏ శుభకార్యమైనా, కష్టమైనా తమ ఇంటి వ్యక్తిలా అందుబాటులో ఉంటారని స్థానికులు, కార్యకర్తలు అనుకున్టున్నారు. ఈ వివాహ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మండలాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


