ములుగు మునిసిపాలిటీ పరిధిలో ప్రారంభమైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

ములుగు మునిసిపాలిటీ పరిధిలో ప్రారంభమైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

ములుగు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. కావున ములుగు మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం అర్హులైన రేషన్ కార్డుదారులు కేటాయించబడిన కేంద్రాలలో గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి