స్టార్ హెల్త్‌కు భారీ షాక్..!!
రూ.2 కోట్ల జరిమానా విధించిన బీమా నియంత్రణ సంస్థ
హైదరాబాద్ : కొవిడ్ సహా ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సరైన కారణాలు లేకుండా తిరస్కరించడం, పాలసీ నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపుల్లో కోతలు విధించడంపై స్టార్ హెల్త్ సంస్థకు రూ.2 కోట్ల జరిమానా పడింది. 2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం 2024 డిసెంబర్ 4న వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసి, 2025 జూన్ 18న విచారణ చేపట్టారు. క్లెయిమ్‌లు తిరస్కరించినప్పుడు లేదా చెల్లింపు మొత్తంలో కోతలు విధించినప్పుడు అందుకు సంబంధించిన పాలసీ నిబంధనలను వినియోగదారులకు స్పష్టంగా వివరించలేదని విచారణలో తేలింది. దీనివల్ల పాలసీదారులు తమ క్లెయిమ్ నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం కోల్పోయారు. క్లెయిమ్‌ల తిరస్కరణకు రూ.కోటి, కోతలు విధించడం, నిర్ణయాలను సరిగా తెలియజేయకపోవడంపై మరో రూ.కోటి జరిమానా విధించారు. నెట్వర్క్ ఆసుపత్రుల తగ్గింపు ఒప్పందాలను బిల్లుల్లో చూపించకపోవడంపై సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. క్లెయిమ్ పరిష్కార పత్రాల్లో చెల్లించిన, తిరస్కరించిన, కోత విధించిన మొత్తాలను స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


