*తిరుమల క్లాసిక్ గార్డెన్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ పట్టణంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన సచిన్ రెడ్డి – హేమాంజలి గార్ల వివాహ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి తో కలిసి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ హాజరయ్యారు. *ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా అభినందించి, పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. వారి జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకలో జిల్లా ముఖ్య నాయకులు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రముఖులు,కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


