కరీంనగర్ లో 23న మహా పాదయాత్రను బిజెపి నాయకులు విజయవంతం చేయాలి..
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలోని మూడు కాపు సంఘంలో శనివారం బిజెపి మండల అధ్యక్షులు కోడె రమేశ్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జ్ సిరిసిల్ల జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జలపతి రెడ్డి విచ్చేసారు చలపతి రెడ్డి కోడె రమేశ్ మాట్లాడుతూ సర్ పేరుతో కాంగ్రెస్ కాక్రోచ్ కానీ మిత్ర పక్షాలు దేశం లో చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొడుతూ, ప్రజల్లో అపోహలను తొలగిస్తూ కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడే లక్ష్యంతో బండి సంజయ్ కుమార్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు చేపట్టిన మహా పాదయాత్రలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పాల్గొననున్న ర్యాలీలో పాల్గొని మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచులు మహేష్ రాజిరెడ్డి బండ సుకన్య దేవయ్య జిల్లా కార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిలు మలేష్ యాదవ్ విగ్నేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్ గంట అశోక్ పత్తి స్వామి, దేవేందర్ గౌడ్, ఆంజనేయులు తోపాటు వివిధ గ్రామాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


