పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా

అర్హులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచి మడావి వెంకటేష్ తాటిగూడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ప్రత్యేక గ్రామసభ

పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా

బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా):  పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తాటిగూడ సర్పంచి మడావి వెంకటేష్ అన్నారు, కాసిపేట మండలం తాటిగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మడావి వెంకటేష్, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీఓ ఎస్‌కే సఫ్దర్ అలీతో కలిసి పథకం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సర్పంచి మాట్లాడుతూ.. కుటుంబ పెద్దకు అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఆ కుటుంబానికి ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబం పథకం వివరాలు తెలుసుకుని ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ధర్మారావుపేట సర్పంచి జె.రాధ, ఉప సర్పంచి తమ్మినేడి విజయలక్ష్మి, శ్యామ్ శేఖర్, ధర్మారావుపేట ఉప సర్పంచి గోపు శ్రీనివాస్, కార్యదర్శి అన్నపూర్ణ, కొండాపూర్, కోనూరు, ధర్మారావుపేట కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 50

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి