పేకాట స్థావరం పై బాన్సువాడ పోలీసుల మెరుపు దాడి.
ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్.....
బాన్సువాడ : పేకాట సవరం పై బాన్సువాడ పోలీసులు మంగళవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. బాన్సువాడ మండలం లో ని కొత్తబాది గ్రామ పరిధి లోని సంతోష్ నగర్ గ్రామ సమీపం లో గల బహిరంగ ప్రదేశం లో కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాన్సువాడ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడి లో పేకాట ఆడుతున్న మాలోత్ చందర్, మేఘావత్ ప్రకాష్, దేవ్ సోత్ శ్రీహరి అనే ముగ్గురు వ్యక్తుల ను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. వారి వద్ద నుండి పేకాటకు సంబంధించిన నగదు రూ.3,200, రెండు సెల్‌ఫోన్లు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాల కు పాల్పడ కుండా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల పై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని బాన్సువాడ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యం గా ఉంచబడును స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాన్సువాడ పోలీస్ స్టేషన్ సెల్ 8712686167
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


