ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో

  • ఘనంగా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుక లు....
  •  మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు,

ఆదిలాబాద్ బ్యూరో  : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి  లాల్ బహదూర్ శాస్త్రి  జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లె పూల నర్సయ్య  మాట్లాడుతూ, సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీ  జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి  దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, ‘జై జవాన్ – జై కిసాన్’ అనే నినాదంతో దేశ రక్షణలో సైనికుడి పాత్రను, దేశ ప్రగతిలో రైతు శ్రమను చాటిచెప్పిన గొప్ప నాయకుడని అన్నారు. నిజాయితీ, నిరాడంబరత, కర్తవ్యనిష్ఠ, దేశభక్తికి ప్రతిరూపంగా నిలిచిన శాస్త్రి  జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్లెపూల నరసయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి , మాజీ డీసీసీ సాజిద్ ఖాన్,జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ ,ఓబీసీ విభాగం అధ్యక్షులు అంబకంటి అశోక్ ,జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజషన్ ఇంచార్జ్ బెజ్జంకి అనిల్ , ఆదిలాబాద్ ఆఫీస్ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజర్ పాషా , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు నాహీద్ , శ్రీలేఖః, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు బండి దేవిదాస్ చారి , మందాకిని, సెక్రటరీలు పురుషోత్తం రెడ్డి, సిరాజుద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి