వేపకు డైబ్యాక్ సెగ – అంతరించిపోతున్న అపర సంజీవని

WhatsApp Image 2026-01-18 at 3.40.01 PM

పచ్చదనానికి ప్రాణవాయువు అయిన వేప మౌనంగా కూలిపోతుంటే – రేపటి తరానికి మిగిలేది పశ్చాత్తాపమేనా?

పల్లె గడపల నుంచి పట్టణాల రహదారుల దాకా ఒకప్పుడు నీడనిచ్చిన, ఆరోగ్యానికి అండగా నిలిచిన వేప చెట్లు నేడు మౌనంగా కూలిపోతున్నాయి. ఆయుర్వేదానికి ప్రాణం, వ్యవసాయానికి రక్షణ కవచం, గ్రామీణ వైద్యానికి చిరునామా అయిన వేప— ఇప్పుడు ఒక “నిశ్శబ్ద శత్రువు” బారిన పడింది. పచ్చదనం మోడువారిపోతుంటే, మన సంస్కృతిలోని ఆనవాళ్లు కళ్లముందే కరిగిపోతున్నాయన్న ఆందోళన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక చెట్టుకు వ్యాధి మాత్రమే కాదు ఇది పర్యావరణ సంక్షోభానికి ముందస్తు హెచ్చరిక...

 ముప్పేట దాడి: ఎందుకు వేప చెట్లు ఎండిపోతున్నాయి? 

వేప చెట్లు ఒకే కారణంతో కాదు ఒకదానికొకటి తోడై పనిచేస్తున్న బహుముఖ దాడులతో బలహీనమవుతున్నాయి.
 WhatsApp Image 2026-01-18 at 3.40.02 PM

డైబ్యాక్ (Dieback) – ప్రాణాంతక శిలీంధ్ర వ్యాధి
ఈ వ్యాధి ఫోమోప్సిస్ అజాడిరాక్టే అనే శిలీంధ్రం వల్ల వస్తుంది.
లక్షణాలు:
పై నుంచి కిందకు కొమ్మలు ముదురు గోధుమ రంగులోకి మారడం ఆకులు, చిగుర్లు ఎండిపోవడం
పువ్వులు వికసించకపోవడం, పండ్లు రాలిపోవడం, చివరికి చెట్టు మొత్తం ఎండిపోవడం, ఇది నెమ్మదిగా వ్యాపించినా చెట్టు మొత్తాన్ని చంపే ప్రమాదకర చంపే వ్యాధి.

టీ మస్కిటో బగ్ – లోపలి ద్వారాలు తెరుస్తున్న కీటకం
ఈ కీటకం వేప చిగుళ్ల నుంచి రసాన్ని పీల్చి వేస్తుంది. ఇది చేసిన గాయాల ద్వారానే శిలీంధ్రాలు చెట్టు లోపలికి ప్రవేశిస్తాయి.  ఈ వ్యాధికి ఇది ప్రధాన సహాయకుడుగా పనిచేస్తుంది.  పరాన్నజీవి (లోరాంథస్) – చెట్టును లోపల నుంచే ఖాళీ చేసే శత్రువు పిచ్చుకల ద్వారా వ్యాపించే ఈ పరాన్నజీవి మొక్క, వేప కొమ్మలపై పెరిగి చెట్టులోని పోషకాలను పీల్చి చెట్టును నిస్సహాయంగా మారుస్తోంది.
వాతావరణ మార్పులు – వ్యాధులకు అనుకూల వాతావరణం అకాల వర్షాలు
గాలిలో అధిక తేమ ఉష్ణోగ్రతల మార్పులు ఈ పరిస్థితులు శిలీంధ్ర వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నాయి..

 సంరక్షణ చర్యలు: వేపకు పునర్జన్మ ప్రసాదిద్దాం! 
వేపను రక్షించడం ఇంకా ఆలస్యం కాలేదు. సకాలంలో సరైన చికిత్స అందిస్తే చెట్టు తిరిగి కోలుకునే అవకాశం ఉంది.
కత్తిరింపులు & బోర్డో మిశ్రమం 
వ్యాధి సోకిన కొమ్మలను  ఎండిపోయిన భాగం కంటే 3 అంగుళాల దిగువకు కత్తిరించాలి ఆ కొమ్మలను వెంటనే తగులబెట్టాలి కత్తిరించిన చోట 1% బోర్డో మిశ్రమం (మైలతుత్తు + సున్నం పేస్ట్) పూయాలి ఇది శిలీంధ్ర వ్యాప్తిని అడ్డుకుంటుంది.
 జీవ నియంత్రణ పద్ధతులు (సేంద్రియ పద్ధతి)
మట్టిలో వేయడం:
250 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి చెట్టు మొదట్లో వేయాలి పిచికారీ:
లీటరు నీటికి 10 గ్రా. సుడోమోనాస్చెట్టు అంతా తడిసేలా పిచికారీ చేయాలి ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రసాయన చికిత్స (తీవ్రత ఎక్కువైతే మాత్రమే)
లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1 గ్రా. కార్బెండిజమ్ 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి 
టీ మస్కిటో బగ్ నియంత్రణకు
2 మి.లీ. ప్రొఫెనోఫస్ లేదా డయోమిథోయేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి 
వేరు ద్వారా మందు (Root Feeding)
పెద్ద చెట్లకు పిచికారీ కష్టమైనప్పుడు,పెన్సిల్ లావున్న వేరును ఏటవాలుగా కత్తిరించాలి10 మి.లీ. కార్బెండిజమ్ ద్రావణం ఉన్న కవర్‌లో వేరును ముంచి కట్టాలి లేదా పెద్ద పాదులు చేసి 50 లీటర్ల నీటిలో 50 గ్రా. కార్బెండిజమ్ కలిపిచెట్టు మొదళ్ళు తడిచేలా పోయాలి  పోషకాలతోనే పునరుజ్జీవనం 
వ్యాధి బారిన పడిన చెట్టుకు అదనపు బలం అవసరం కాబట్టి చెట్టు వయస్సును బట్టి 100 – 500 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (MOP) ను చెట్టుకు అందించాలి పొటాష్ చెట్టులో సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

ఈరోజు వేపను రక్షించలేకపోతే, రేపు మనమే రక్షణ కోసం వెతకాల్సి వస్తుంది. ఔషధంగా మనల్ని కాపాడిన వేప…పర్యావరణానికి ప్రాణం పోసిన వేప…సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వేప…ఇప్పుడు మన చేతుల్లోనే తన భవితను పెట్టుకుంది. ఇది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు,మన అందరి సామూహిక బాధ్యత...

ఒక వేప చెట్టును కాపాడితే,
ఒక కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడినట్టే..
ఒక గ్రామం పచ్చదనాన్ని నిలబెట్టినట్టే..
ఒక తరం భవిష్యత్తును భద్రపరిచినట్టే..
వేపను కాపాడుదాం మన సంస్కృతిని రక్షించుకుందాం..

జి. అజయ్ కుమార్ 
వ్యవసాయ నిపుణులు

WhatsApp Image 2026-01-18 at 3.40.02 PM(1)

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే