చట్టబద్ధంగానే ఇళ్ళ స్వాధీనం: కార్యనిర్వహణాధికారిణి లావణ్య ..

WhatsApp Image 2026-02-04 at 5.40.47 PM

 

ఎల్బీనగర్  :  న్యాయస్థానం ఆదేశాల మేరకే సైదాబాద్ మండల సర్వేనెంబర్ 110 లో ఉన్న రెండెకరాల 34 గుంటల ఇనాం భూమిని మంగళ వారం పోలీసుల,దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో స్వాధీనపరుచుకున్నామని కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారిణి లావణ్య ఓ పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు.ఈ ఆలయ పరిధిలోని శ్రీ భాన్ సూరి వాలా కృష్ణ మందిరాన్ని దత్తత, ఆలయ నిర్వహణతో పాటు కృష్ణ మందిర భూములను, పరిరక్షణ బాధ్యతలను కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి అధికారమిచ్చినట్లు సెక్షన్ 38,43 రిజిస్టర్ లలో నమోదయి ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ భూములపై గతంలో చట్ట విరుద్ధంగా జారీచేసిన స్వాధీన హక్కు పత్రాలను రద్దుచేస్తూ 2013లో ఆర్డీవో దేవస్థానానికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని, ఎండోమెంట్ ట్రిబ్యూనల్లో మొత్తం 21కేసులు దాఖలు అయ్యాయని వీటిలో పది కేసుల్లో 2020లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వెలబడిందని,పది కేసుల్లో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా తుది తీర్పు వచ్చేవరకు నెలకు 3500 అద్దెను దేవస్థానానికి చెల్లించాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,మరొక కేసులో ఎలాంటి స్టే ఉత్తర్వులు లేకపోవడంతో సంబంధిత ఇంటిని దేవస్థానం గతంలో స్వాధీనం చేసుకుందని,మిగిలిన 11 కేసులపై సుదీర్ఘ విచారణ అనంతరం 2025 అక్టోబర్ 31న ఎండోమెంట్ ట్రిబ్యూనల్ దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, మూడు నెలల్లో ఇళ్ళు ఖాళీ చేయాలని నివాసితులకు ఆదేశాలు జారీ చేసింది.నిర్ణీత గడువు 2026 జనవరి 31 నా ముగిసిన ఎలాంటి స్టే ఉత్తర్వులు లేనందున,విధి నిర్వహణలో భాగంగా మంగళవారం 11 ఇళ్లను స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.ఆలయ ఆస్తుల పరిరక్షణకే కట్టుబడి ఉన్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ చర్యల్లో ఎలాంటి రాజకీయ ప్రేరణలు, వ్యక్తిగత దురుద్దేశం, ఒత్తిళ్లు లేవని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి.  బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్. ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి. బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్.
        అనంతగిరి  : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్ అన్నారు. అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ఈనెల 8వ తేదీన
24 గంటల్లో ఛేదించిన దుండిగల్ వృద్ధ మహిళ హత్య కేసు
వృత్తి శిక్షణా కోర్సుల తరగతులను పరిశీలించిన డీజిఎం - ఎస్ అనిల్ కుమార్
చట్టబద్ధంగానే ఇళ్ళ స్వాధీనం: కార్యనిర్వహణాధికారిణి లావణ్య ..
ఒకే వార్డులో అన్నదమ్ముల పోటీ…
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయి. పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్. పర్వతగిరి సి.ఐ బి.రాజగోపాల్.
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి