ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం...

 - తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి 

IMG-20260224-WA1147

ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు ముఖ్య మంత్రిగా కొనసాగుతారు 


హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ  తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి  ఆధ్వర్యంలో  మంగళవారం గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ..  గత పదేళ్ల పాలనలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఏరోజు పట్టించుకోలేదని, ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని అన్నారు. బంతిపూలతో ఉద్యమం చేసిన తన కూతురు కవితకి మాత్రమే గత ప్రభుత్వంలో సముచిత స్థానం లభించిందని..  అంతే తప్ప ఏ ఉద్యమకారునికి టిఆర్ఎస్ పాలనలో సముచిత  స్థానం లభించలేదని అన్నారు. ఉద్యమకారులు చేసిన ఉద్యమాన్ని కేవలం తన కుటుంబం మాత్రమే ఈ ఉద్యమం చేసిందని సమాజానికి చెప్పుకోవడం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎక్కడా ఉద్యమకారుల గురించి ప్రస్తావన లేకుండా...  అమరవీరుల కుటుంబానికి పాలనలో భాగస్వామ్యం లేకుండా...  కనీసం వారి కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించని అతి క్రూరమైన వ్యక్తి కెసిఆర్ అని ధ్వజమెత్తారు.  గత ప్రభుత్వం పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత మళ్ళీ ఉద్యమకారుల ముసుగు వేసుకొని మళ్లీ తెలంగాణలో తిరుగుతూ దొంగ నాటకాలు ఆడుతోందని, ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే హైదరాబాదులో ఇల్లు లేదు అన్న కల్వకుంట్ల కవితకు నేడు వందల కోట్ల బంగ్లా..  మద్యం వ్యాపారంలో వచ్చిన లక్షల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. ఆ వందల కోట్ల గురించి ప్రజలకు తెలియజేసి ప్రజలను క్షమాపణలు కోరి, అప్పుడు రాష్ట్రంలో పర్యటించాలని కల్వకుంట్ల కవిత కు పిడమర్తి రవి సూచించారు.

ప్రస్తుత ప్రజా పాలనలో ఉద్యమకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాపెద్దపీట వేస్తూ.. ఉద్యమకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని మంత్రిమండలి ప్రకటించడం, వెంటనే రాష్ట్ర హైకోర్టు ఉద్యమకారుల కు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని చెప్పడం అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి రేవంత్ రెడ్డి పట్టించుకొని ఉద్యమకారుల సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడితే మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు ఎండి రహీం, డాక్టర్ బోమ్మెర స్టాలిన్, చిరుమర్తి రాజు, డాక్టర్ మీసాల మల్లేష్,బోరెల్లి సురేష్, చింతమల్ల శోభన్ బాబు, సైదాబాద్ గణేష్, ఆంజనేయులు, కంపాటి వెంకట్ గౌడ్, దేవరకొండ నరేష్, నక్క మహేష్, జోగు గణేష్, ఆరె కంటి శ్రీకాంత్, చాగంటి శేఖర్, ఓంకార్, రాజు యాదవ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

1000785970
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం... ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం...
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు ముఖ్య మంత్రిగా కొనసాగుతారు  హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని హైకోర్టు...
డ్రైవర్లకు ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు వెల్లడి
జీపి కార్మికుల వేతనాలు చెల్లించాలి.. ఇల్లందు ఎంపిఓ కి ఐఎఫ్టియు వినతి..
యాప్ ద్వారా రైతులకు యూరియా కొనుగోలు – సౌకర్యమా? లేక ఇబ్బందులా?
కన్నం వేసిన 48 గంటల లో కటకటాలోకి నేరస్తులు
విద్యార్థులకు ఆహార ప్లేట్ల పంపిణీ -ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పెందోర్ సంతోష్
పెద్ద శంకరంపేట్ మండలంలో ప్రజావాణి కార్యక్రమం