డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం:

ఎల్బీనగర్ : ఆటోనగర్‌లోని టీజీఐఐసీ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్రాలయ కంటి ఆసుపత్రి, రవాణా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు నియమ నిబంధనలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీ నగర్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అనురాధ, రవాణా విభాగ పోలీసు కమిషనర్ శ్రీనివాస్, ఉప పోలీసు కమిషనర్ మనోహర్, సహాయ పోలీసు కమిషనర్లు కాశి రెడ్డి, నవీన్ రెడ్డి పాల్గొన్నారు. వనస్థలిపురం పోలీసులు , రవాణా విభాగ అధికారులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.హైదరాబాద్ లారీ సంఘం, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ , వరుణ్ మోటార్స్, మెకానిక్ సంఘాలకు చెందిన సుమారు 120 మంది డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రైవర్లకు రహదారిపై ప్రయాణ నియమాలు, సిగ్నల్ వ్యవస్థ పాటించడం, వరస క్రమశిక్షణ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అనధికార పార్కింగ్, వాహనం నడుపుతూ మొబైల్ వినియోగం నిషేధం, హెల్మెట్–సీటుబెల్ట్ అవసరం వంటి అంశాలపై అధికారులు వివరంగా డ్రైవర్ల కు అవగాహన కల్పించారు. అనంతరం నేత్రాలయ వైద్య బృందం డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమం రహదారి భద్రతపై డ్రైవర్లలో చైతన్యం కల్పించిందని అధికారులు తెలిపారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

