ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్

WhatsApp Image 2026-02-09 at 12.31.46 PM

 

హైదరాబాద్  :  ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పోరేషన్లలో  అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్  నూతి శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.   రెండున్నర సంవత్సరాల నుండి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కొంతమంది కళ్ళు ఉంది చూడలేని కబోదులకు కనిపించడం లేదని   ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో  చేసిన అభివృద్ధి లిస్టు చేంతాడంత ఉందని అన్నారు. రెండు సంవత్సరాలలో 70 వేల ఉద్యోగాలు కల్పించడం, హాస్టల్ గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు  40% పెంచడం కాస్మోటిక్ చార్జీలలో 200% పెంచడం లాంటివి కాకుండా 25వేల కోట్లతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మాణం కొనసాగుతుందని అన్నారు. వచ్చే విద్యా  సంవత్సరం నుండి విద్యార్థులకు అల్పాహారం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పంగా తీసుకున్నారని  25.3 లక్షలమంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తొమ్మిది రోజుల్లో 9000 కోట్లు రైతు భరోసా నిధులు ప్రభుత్వం ఇచ్చిందని  వ్యవసాయ రంగానికి1.15 లక్షల కోట్లు ఖర్చు చేశారని వ్యవసాయాన్ని పండుగ చేశారని  అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత మహిళల చేతిలో 27 వేల కోట్లు నిధులు పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ దేనిని ప్రస్తుతం మహిళలకు పెట్రోల్ బంకులు  నిర్వహించుకునే సదవకాశాన్ని కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ కే దక్కుతుందని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.

 రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 17,442 కోట్లు ఖర్చు చేశామని భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని అభివృద్ధి సంక్షేమం అందిస్తున్న కాంగ్రెస్ కు పట్టం కట్టాలని అభిప్రాయానికి ఓటర్లు వచ్చారని, ఆదిలాబాద్ నుండి గద్వాల, పరిగి నుంచి కోదాడ వరకు కాంగ్రెస్ ను గెలిచి తీరుతుందని స్పష్టత ఓటర్లలో ఉంది అన్నారు. ఒక పది సంవత్సరాలు కుటుంబ పాలనలో నలిగిన ప్రజలు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో  ప్రజాపాలన నడుస్తుందన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని గత ప్రభుత్వ హయాంలో అర్హులకు రేషన్ కార్డులు అందలేదని అర్హులైన కుటుంబ సభ్యులకు రేషన్ కార్డులో నమోదు చేసే అవకాశం కూడా ఉండేది కాదని గత ప్రభుత్వం ఏడాదికి 12,000 కోట్లు ఖర్చు చేసి 2.8 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇచ్చే వారని ఆ దొడ్డు బియ్యం తినలేక 90 శాతం మంది లబ్ధిదారులు కిలో ఐదు రూపాయల చొప్పున విక్రయించే వారని దీనితో దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి రైస్ మిల్లులకు, బీర్ల కంపెనీలకు, పౌల్ట్రీ ఫాంలకు వెళ్లిపోయేవని తెలిపారు. గత ప్రభుత్వం ఇలాంటి అక్రమ వ్యాపారాలకు తెగబడిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బియ్యం పక్కదోవ పట్టవద్దన్న ఉద్దేశంతో సన్నబియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడా సన్న బియ్యం ఇస్తున్న దాఖలాలు లేవని అన్నారు 13,600 కోట్లతో 3.15 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించామని పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించే బాధ్యత మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి 100% శాతం తన భుజస్కందాలపై వేసుకుని విజయవంతం చేశారని అన్నారు. అంతేకాకుండా రైతులకు బోనస్ ఇవ్వడం, సన్నధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు ఎక్కడ కష్టం కలగకుండా ప్రజా పాలన సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అన్ని మున్సిపాలిటీలలో, గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి కే కానుకగా అందజేయాలని  నూతి శ్రీకాంత్ గౌడ్ కోరారు.

 దేశంలో కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్

 దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం  కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచి కుల గణన చేపట్టబోతుందని, ఎస్సీ బిడ్డల జీవితకాల కోరిక అయినా ఏ.బి.సి.డి ల వర్గీకరణ చేసి చూపించామని 13వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం ఏకైక తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్రంలో ప్రజల సంతోషాన్ని ప్రతిపక్ష నాయకులు ఓర్వ లేకపోతున్నారని అక్కసుతో, అసూయతో, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, ఉప ఎన్నికలలో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పని అయిపోయింది అని ప్రచారం చేశారని కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు "కారు" కూతలు కూస్తున్నారని మునిసిపల్ ఎన్నికల్లో 100కు 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

 ముఖ్యంగా తాను ఇన్చార్జిగా ఉన్న హుజూర్ నగర్  ప్రాంతం  మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమని గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోనే 10 ఏళ్ల రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ప్రజాపాలన ప్రభుత్వంలో రైతాంగం పేద ప్రజలు నిరుద్యోగులు సంతోషంగా ఉంటే బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ అదరదు, బెదరదు, అన్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో సహకరించక పోయిన తల తాకట్టు పెట్టి అయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి కే దక్కుతుందని  అందుకే ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి "హస్తాని"కి సమస్త సహకారం అందించాలని నూతి శ్రీకాంత్ గౌడ్ కోరారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సండ్ర అభ్యర్థులను ఓడించండి: పిడమర్తి రవి సండ్ర అభ్యర్థులను ఓడించండి: పిడమర్తి రవి
    ఖమ్మం : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాలిటీ కల్లూరు మున్సిపాలిటీ లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను
హుస్నాబాద్ లో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్
రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత.
అభివృద్ధి కోసం..... కౌన్సిలర్లను గెలిపించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
మధిర పట్టణం లో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్.
వేములవాడ మున్సిపల్ 17 వార్డులో ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి