చైతన్యమే వినియోగదారుల హక్కులకు రక్ష

డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం1986 అమలు సందర్భంగా రాసిన కవిత
వినియోగదారుడా మేలుకో
నీహక్కులను రక్షించుకో
వస్తు సేవలను కొనేటప్పుడు
నాణ్యతను చూడు తయారీ
తేదీ ఎక్స్పైరీ తేదీలను
చూసి ఎంపిక చేసుకో
కొన్న వాటికి అడిగి రసీదు తీసుకో
మోసపోయిన మౌనంగా ఉండకు
ప్రశ్నించడం నీ ధర్మం పోరాటం
చేయడం నీ హక్కు
మార్కెట్లో వినియోదారుడే
సార్వభౌముడు అన్న సత్యాన్ని
మరవద్దు మార్కెట్లో జరిగే
మోసాలకు మౌనంగా ఉండొద్దు
జరిగిన మోసాలను ధైర్యంగా
ఎదుర్కోవాలి
కల్తీ లేనిసరుకులు కొనాలి
తక్కువ తుకానికి తల
వంచకు తప్పుడుప్రకటనల
మాయాజాలంలో పడకు
న్యాయం కోసం వినియోగదారుల
కోర్టులను ఆశ్రయించు
వినియోగ దారుల హక్కుల
పట్ల అవగాహన పెంచుకో
అన్యాయాన్ని ఎదుర్కోవాలి
నిరంతర చైతన్యంతో
అప్రమత్తంగా ఉంటేనే
నీహక్కులకు రక్షణ
వినియోదారుని రక్షణ కొరకు
ఉన్న హక్కు పట్ల అవగాహన
పెంచుకో వస్తువు ధర
సమాచార హక్కు
వస్తువును ఎంచుకునే హక్కు
అన్యాయం జరిగినపుడు
కోర్టులకు వినిపించుకునే హక్కు
నష్ట పరిహారపరిష్కార హక్కు
పై పూర్తిస్థాయి అవగాహన
కలిగి ఉండాలి
వ్యాపార సంస్థలుచేసే మోసాలకు
తప్పు ప్రకటనలకు ఆకర్షితమై
ఆర్థికంగా నష్టపోవద్దు.
ప్రభుత్వం పౌర సరఫరా శాఖ
తూనికల కొలతల శాఖ
అప్రమత్తంగా ఉండి మార్కెట్లో
జరిగే తూకంలో మోసాలను
అరికట్టాలి ఐఎస్ఐ అగ్మార్క్
ఉన్న వస్తువులను విక్రయించేట్లు
పర్యవేక్షించాలి షరతులు
ఉల్లంఘించిన వ్యాపారులపై
చట్టబద్ధ చర్యలు తీసుకోవాలి
మహిళా సంఘాలు
యువజన సంఘాలు
వినియోగదారుల క్లబ్బులు
స్వచ్ఛంద సంస్థలు
వినియోదారుల
హక్కుల రక్షణ చట్టంపై
అవగాహన సదస్సులు
నిర్వహించి పౌర సమాజాన్ని
చైతన్యం పరచాలి
వినియోగ విద్యను
విద్యాసంస్థల్లో
పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి
పౌరులను చైతన్య పరచాలి
వినియోగదారుల హక్కుల
రక్షణకు ఉచిత న్యాయ
సహాయం అందించాలి
మండల జిల్లా కేంద్రాల్లో
వినియోగదారుల ఫోరంలో
పూర్తిస్థాయి సిబ్బందిని
నియమించి వినియోగదారులకు
న్యాయం చేయాలి
వినియోగదారుడా
మేలుకో నాణ్యతను ఏలుకో
నిరంతర అప్రమత్తతే
నీ హక్కులకు శ్రీరామరక్ష
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
ఉపాధ్యక్షులు
రాష్ట్ర వినియోగదారుల
హక్కుల రక్షణ మండలి
హైదరాబాద్
9440245771
Views: 17
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
03 Mar 2026 08:13:04
అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...
కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని, కన్న
