అక్కన్నపేటలో బెల్ట్‌షాపుల దందా.. అధికారుల మౌనం ఎందుకు?

అక్కన్నపేటలో బెల్ట్‌షాపుల దందా.. అధికారుల మౌనం ఎందుకు?

  • 24 గంటలు మద్యం అందుబాటులోనే!
  • క్వార్టర్‌పై రూ.40 వరకు అదనపు వసూళ్లు
  • రామవరంలో నాటుసారాతో లిక్కర్ బాటిళ్ల తయారీ ఆరోపణలు
  • బెల్ట్ షాపులు నడవడానికి సహకరిస్తున్న హుస్నాబాద్ ఎక్సైజ్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని
  • సామాజిక కార్యకర్త ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

అక్కన్నపేట : అక్కన్నపేట మండలంలో బెల్ట్‌షాపుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లో సైతం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, రోజులో ఏ సమయంలో వెళ్లినా మద్యం అందుబాటులో ఉంటోందని వారు పేర్కొంటున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై ఆబ్కారీ అధికారులు, పోలీసు సిబ్బంది తగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్వార్టర్‌పై రూ.40 వరకు అదనపు వసూళ్లు
మండలంలోని పలు బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయిస్తూ ఒక్కో క్వార్టర్‌పై రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భిన్నంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరల వసూళ్లపై తనిఖీలు నిర్వహించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.
రామవరంలో లిక్కర్ బాటిళ్ల తయారీ ఆరోపణలు
ముఖ్యంగా రామవరం గ్రామంలో నాటుసారాకు రంగులు కలిపి, మద్యం బాటిళ్లలో నింపి లిక్కర్‌గా విక్రయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఒక వ్యక్తి ఏకంగా బాటిళ్లలో ద్రవాన్ని నింపి విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాటిళ్లలో ఏ పదార్థాన్ని నింపుతున్నారు, ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎవరు విక్రయిస్తున్నారు అనే అంశాలను తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
24 గంటలు మద్యం లభ్యతపై ఆందోళన
అనుమతించిన సమయాలను మించి రాత్రింబవళ్లు మద్యం అందుబాటులో ఉండటం వల్ల యువత, కార్మికులు, పేద కుటుంబా లపై ప్రతికూల ప్రభావం పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొనసాగితే గ్రామాల్లో శాంతిభద్రతలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలి
హుస్నాబాద్ పరిధిలోని ఆబ్కారీ వ్యవస్థపై స్థానికంగా పలు ఆరోపణలు, ఫిర్యాదులు వినిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన తనిఖీలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. బెల్ట్‌షాపులు, అధిక ధరలకు మద్యం విక్రయాలు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలు, కల్తీ మద్యం తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. అక్కన్నపేట మండలంలో బెల్ట్‌షాపుల నిర్వహణ, అధిక ధరలకు మద్యం విక్రయాలు, రామవరంలో నాటుసారా కల్తీ చేసి బాటిళ్లలో నింపుతున్నారనే ఆరోపణలపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని సామాజిక కార్యకర్త ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆరోపణల్లో వాస్తవం లేకపోతే అధికారికంగా స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి