పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వాహణ

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వాహణ

నిజామాబాద్ :  నిజామాబాద్  పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు తేది: 2-10-2026 నాడు ఉదయం 11:00 గం||ల సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలో  మహత్మాగాంధీ జయంతి వేడుకలు వేడుకలు అదనపు డి. సి. పి ( అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ( అడ్మిన్ )  మాట్లాడుతూ గాంధీజి అనుసరించిన అహింస , సత్యాగ్రహం ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. కులం , మతం , లింగ విభేదాలను పట్టించుకోకుండా అంతా సర్వసమానులేనని ఆయన బోధించారు. మహత్ముడు కలలు కన్న గ్రామస్వరాజ్యం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని , పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని అన్నారు. ఈ సందర్భంగా ఎ.సి.పి ( ఎ.ఆర్ )   కృష్ణ , ఆఫీస్ సూపరింటెండెంటులు  శంకర్ , వనమాల , జగతి  , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ ,  పోలీస్ కార్యాలయం సిబ్బంది , సి.సి.ఆర్.బి సిబ్బంది , సి.ఎస్.బి సిబ్బంది , ఐ.టి కోర్ సిబ్బంది , పోలీస్ కంట్రోల్ రూo సిబ్బంది , సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది తదితరులు  హజరుకావడం జరిగింది.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి