బాన్సువాడ లో ఘనం గా గాంధీ జయంతి వేడుకలు.

బాన్సువాడ లో ఘనం గా గాంధీ జయంతి వేడుకలు.

గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ : మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రం లోని గాంధీ చౌక్‌ లో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా పోచారం  మాట్లాడుతూ. సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మ గాంధీ మహనీయుడ ని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం, ప్రజలను ఏకం చేసిన నాయకత్వం దేశ చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోయాయని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వం కలిగిన, సామాజిక న్యాయం తో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆలోచనలు, ఆదర్శాలు నేటి సమాజానికి మాత్రమే కాకుండా భావితరాల కు కూడా మార్గదర్శకం గా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాసుల విజయ, బాన్సువాడ పట్టణ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు  మహాత్మ గాంధీకి నివాళులర్పించారు.

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి