బాన్సువాడ లో బి ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఉన్నాం.
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు శుక్రవారం సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాన్సువాడ నియోజకవర్గం లో పార్టీ బలోపేతం పై చర్చ బాన్సువాడ నియోజకవర్గాని కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మోరల్. శ్రీనివాస్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ ని మర్యాద పూర్వకం గా కలిశారు. ఈ సందర్భం గా బాన్సువాడ నియోజకవర్గం లో పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమన్వయం, పార్టీని మరింత బలోపేతం చేయడం తదితర అంశాల పై కేటీఆర్ తో సుదీర్ఘం గా చర్చించారు. బాన్సువాడ లో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టి గా కృషి చేస్తామని శ్రీనివాస్ రావు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


