చట్టాలు వర్తించవా? పేరుకే సర్పంచ్‌.. పెత్తనం భర్తదేనా?

చట్టాలు వర్తించవా? పేరుకే సర్పంచ్‌.. పెత్తనం భర్తదేనా?

దౌల్తాబాద్‌,సిద్దిపేట: కోనాపూర్‌ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల నిర్వహణపై వివాదం నెలకొంది. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.

మహిళా భవనం ఉన్నా.. కొత్తది ఎందుకు? 

గ్రామపంచాయతీ భవనంలో ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక గది, అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌ సౌకర్యం ఉన్నప్పటికీ.. మరోచోట సుమారు రూ.10 లక్షలతో కొత్త మహిళా భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉన్న భవనానికి సుమారు రూ.3 లక్షలతో మరమ్మతులు చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చని స్థానికులు చెబుతున్నారు.

భర్త జోక్యంపై ఆరోపణలు

ఎన్నికైన సర్పంచ్‌ ఉండగా పంచాయతీ వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త నిర్మాణానికి గ్రామసభ తీర్మానం, అనుమతులు, నిధుల మంజూరు తదితర వివరాలను అధికారులు వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆరోపణలపై సర్పంచ్‌ వర్గం వివరణ ఇవ్వాల్సి ఉంది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి