అఖిలభారత 36వ మహాసభను జయప్రదం చేయండి.:లక్ష్మీనారాయణ.

అఖిలభారత 36వ మహాసభను జయప్రదం చేయండి.:లక్ష్మీనారాయణ.

నాగార్జునసాగర్  : ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను,ఆ సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం అఖిలభారత రైతు సంఘం జాతీయ 36 మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పెద్దవూర మండల కేంద్రంలో రాస్తున్న వాల్ రైటింగ్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలు అప్పుల ఊబిలో నుండి బయటపడాలంటే రైతులు పండించే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించి అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. మండలంలో పత్తి పండ్ల తోటలు కూరగాయలు బాగా పండిస్తున్నారని కానీ కనీస మద్దతు ధరలు రాక అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు రైతాంగం వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఎల్ ని నో ప్రభావంతో మండలంలో అనేక రకాల పంటలు ఎండిపోయాయని సరైన దిగుబడి రాలేదని అటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు.ఎండిన పంటలకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విప్లమయ్యాయని విమర్శించారు. ఈ సమస్యలపై జాతీయ మహాసభల్లో చర్చించి పెద్ద పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని అన్నారు.ఈకార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య మండల కమిటీ సభ్యులు ఎస్ కె బషీర్, చిరు నాగార్జున, దోరేపల్లి మల్లయ్య, చెన్ను లచ్చిరెడ్డి నాయకులు భూతం అర్జున్, ఎస్.కె మద్దుమ్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ