ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యుడిగా ఆడప సమ్మయ్య
మహాదేవపూర్(భూపాలపల్లి) : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కాళేశ్వరం గ్రామానికి చెందిన ఆడప సమ్మయ్య మరోసారి ఎన్నికయ్యారు. 2026–2029 కాలానికి నిర్వహించిన ఎన్నికల్లో ఆయన మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారు. గతంలో 2023–2026 కాలానికి కూడా మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగిన ఆడప సమ్మయ్యకు, తాజాగా 2026–2029 కాలానికి రెండోసారి సభ్యుడిగా అవకాశం రావడం విశేషం. వరుసగా రెండోసారి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా ఎన్నిక కావడంపై కాళేశ్వరం గ్రామస్థులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


