మృతుడి కుటుంబానికి సర్పంచ్ రూ.10 వేల ఆర్థిక సాయం
- ఈ సందర్భంగా సర్పంచ్ పార్కల రాం రెడ్డి మాట్లాడుతూ
చౌటకూర్ : ఇటీవల మృతి చెందిన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామానికి చెందిన చాకలి నాగయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచి, కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పార్కల రాం రెడ్డి మాట్లాడుతూ.. నాగయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన వంతు సహకారం అందించేందుకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్కలా రమేష్, వార్డు సభ్యులు బలరాజ్, చక్రపాణి, డప్పు అశోక్, గంగారాం, తొవ్వల మల్లికార్జున్, కారోబార్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


