ధర్మసాగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణుల నిరసన
“హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దు” — బీజేపీ శ్రేణుల నినాదాలు
ధర్మసాగర్, సెప్టెంబర్ 30: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఇటీవల శ్రీరాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మసాగర్ మండలంలో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. చేతుల్లో బీజేపీ జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 28న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతీయులను ద్రావిడులు, ఉత్తర భారత నాయకులను ఆర్యులుగా పేర్కొంటూ, దక్షిణ భారతీయులు శివ భక్తులు, ఉత్తర భారత నాయకులు రామ భక్తులని వ్యాఖ్యానించారు. అలాగే “శ్రీరాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడు” అని ఆయన కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి, హిందూ వ్యతిరేక బుద్ధికి నిదర్శనం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వీరు ఇప్పుడు దేవుళ్ల మధ్య కూడా విభజన గీతలు గీస్తున్నారు.అని అన్నారు
నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బైరిపాక కుమార్ మండల ప్రధాన కార్యదర్శి శివ భాజపా జిల్లా మండల యువజన నాయకులు శ్యామ్ , రఘు దీర్ మరియు అమరేందర్ రెడ్డి, గంకిడి వెంకట్ రెడ్డి , మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
About The Author


