మండల మహిళా సమాఖ్య 18 వ వార్షిక మహసభ

మండల మహిళా సమాఖ్య 18 వ వార్షిక మహసభ

- హాజరైన సర్పంచ్,  ఎంపిడిఓ,ఎంపిఓ,ఎంఈఓ

వెంకటాపురం: ములుగు జిల్లా,వెంకటాపురం మండల మహిళా సమాఖ్య  18వ వార్షిక మహాజనసభ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ  సెర్ప్ డిఆర్డిఏ ద్వారా చేపట్టే  ప్రగతి నివేదిక పై సమీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 2026 - 27 చేపట్టు అభివృద్ధి ప్రణాళిక సమీక్ష నిర్వహించారు .2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సామాజిక పెట్టబడి నిధి ( సీఐఎఫ్ )స్వయం సహాయక సంఘాలకు  రుణాలు మంజూరు చేసింది .దీని ద్వారా సంఘ సభ్యులు తీసుకున్న రుణాలు  చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరచుకొని ఆదాయం పెంచుకోవాలని , సకాలంలో సక్రమ పద్ధతిలో రికవరీ చేయాలని తెలిపారు.  మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్  మాట్లాడుతూ వెంకటాపురం మండల మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమంలో మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తుందని  దీనిలో భాగంగా  మహిళా సంఘ సభ్యురాలు సహజ కాలం చెందితే రెండు లక్షల వరకు లోన్ బీమా, ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 10 లక్ష వరకు ప్రమాద బీమా  అందిస్తుందని,అలానే వడ్డీ లేని రుణం  10 లక్షలు బ్యాంకు లోన్  కు వర్తింప చేస్తున్నారని. తీసుకున్న రుణాలు  మహిళా సంఘ సభ్యులు జీవనోపాధి పెంచుకునే విధంగా ఉండాలని దాని ద్వార  కుటుంబ ఆదాయం పెరగటం  వారి జీవన పోషణ సక్రమంగా ఉండుట వలన ఆర్థిక పరిపూష్టి సాధిస్తారని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ తాటి సరస్వతి, మండల పంచాయతీ అధికారి  బొగ్గ నారాయణ, మండల విద్యాశాఖాధికారి జివివిసత్యనారాయణ, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ కాల్వ అప్పారావు,తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రత్నాకర్, సీసీలు శంకరమ్మ , నరసయ్య,సమ్మయ్య, కుడికాలు వెంకటలక్ష్మి, కోటిపల్లి వెంకటలక్ష్మి, మండల సమైక్య కోశాధికారి పూనెం ఉషారాణి, మండల సమైక్య సిబ్బంది  స్వప్న, సతీష్, గ్రామ సమాఖ్య విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లు, గ్రామ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 88

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ