కలెక్టరేట్ మార్గంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు.

కలెక్టరేట్ మార్గంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు.

నస్పూర్ (మంచిర్యాల): మంచిర్యాల కలెక్టరేట్ రోడ్డులో భద్రతా చర్యల్లో భాగంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి హబీబ్ హుస్సేన్ ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ ప్రధాన మార్గంలోని ఐడీఓసీ  కమాన్ వద్ద 3 సీసీ కెమెరాలు, హైవే కమాన్ వద్ద 2 సీసీ కెమెరాల చొప్పున మొత్తం 5 నిఘా కెమెరాలను అమర్చారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (ఐఏఎస్) మరియు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు సమాజహితం, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో నిరంతరం నిఘా ఉండటం వల్ల శాంతిభద్రతల పరిరక్షణకు, భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ