తిమ్మాజిపేట్ ఎంఇఓ జీఓ నెం.25 కి విరుద్ధంగా ఇచ్చిన డిప్యుటేషన్లను రద్దుచేసి ఎంఇఓను సస్పెండ్ చెయ్యాలి.
నాగర్ కర్నూల్ జిల్లా :తిమ్మాజిపేట్ మండలంలో ఎంఈఓ ఇచ్చిన డిప్యుటేషన్లు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. దీనివల్ల చాలా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు నష్టం జరుగుతుందని, బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత భవనంలో జిల్లా విద్య అధికారిని కలసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ...జడ్పీహెచ్ఎస్ అవంచలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం కలిపి 205 మంది పిల్లలు ఉంటే 11 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. జీఓ 25 ప్రకారం 13 మంది ఉండాలి. అక్కడే ఇద్దరు తక్కువ ఉంటే, అక్కడి నుంచి ఏకంగా 5 మందిని వేరే స్కూళ్లకు డిప్యుటేషన్ మీద పంపించారు. దీనివల్ల ఆ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేరు. MEO పంపిన లిస్ట్ లో 40వ నంబర్ లో ఉన్న ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ ని ఎస్జీటీ అని తప్పుగా చూపించి, 65 మంది పిల్లలు, 5 మంది టీచర్లు ఉన్న యూపీఎస్ కి పంపించారు. అక్కడ అవసరం లేకపోయినా పంపించారు. ఇంకో విషయం చైన్ సిస్టం డిప్యుటేషన్. ఇది ఎక్కడా లేదు. పోతిరెడ్డిపల్లి నుండి ఒకరిని బోయగేరికి, బోయగేరి నుండి ఒకరిని అవసరం లేకపోయినా జడ్పీహెచ్ఎస్ తిమ్మాజిపేట్ కి తెచ్చుకున్నారు. అలాగే మారేపల్లి నుండి పుల్లగిరికి, పుల్లగిరి నుండి ఇంద్రానగర్ తండాకు ఇచ్చారు. ఇలా చైన్ లాగా ఇచ్చుకుంటూ పోతున్నారు. జడ్పీహెచ్ఎస్ తిమ్మాజిపేట్ లో 240 తెలుగు, 250 ఇంగ్లీష్ పిల్లలకు హెచ్ఎం తో కలిపి 17 మంది ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు డిప్యుటేషన్ వాళ్లతో కలిపి 23 మంది ఉన్నారు.పిజికల్ సైన్స్ ఒకరు ఇంగ్లీష్ ఇద్దరు, హిందీ ఒకరు, తెలుగు ఒకరు, పీఈటీ ఒకరు ఎక్కువగా ఉన్నారు. ప్రతి క్లాస్ కు రెండు సెక్షన్లు మాత్రమే ఉన్నా మూడు సెక్షన్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పలపల్లి యూపీఎస్ లో 65 మందికి 6 మంది ఉంటే ఒకరిని కూడా తీయలేదు. కానీ నేరెళ్లపల్లి యూపీఎస్ లో 110 మందికి 6 మంది ఉంటే అక్కడి నుంచి ఒకరిని తీసేశారు. ఇది చాలా పక్షపాతంగా ఉందనీ అన్నారు. సామాన్య విద్యార్థుల దృష్టిలో పెట్టుకుని విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఈ చైన్ సిస్టం డిప్యుటేషన్లన్నీ రద్దు చేయాలని, దీనికి కారణమైన ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని కోర్యామని తెలిపారు. దీనికి డిఇఓ రమేష్ కుమార్ స్పందిస్తూ సంబంధించిన ఎంఇఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని కచ్చితంగా విద్యార్థులు నష్టపోకుండా చూస్తామని, అదే విధంగా ఈ అంశంపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నామని తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘము జిల్లా నాయకులు ఎ. పర్శ, గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ సెక్రటరీ నల్లవెల్లి భరత్, నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


