ఏబీవీపీ నగర కార్యదర్శిగా ఇస్లావత్ మహేష్

ఏబీవీపీ నగర కార్యదర్శిగా ఇస్లావత్ మహేష్

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ఆలోచించే ఏకైక విద్యార్థి సంఘం:- ఏబీవీపీ    

కొండమల్లేపల్లి,: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నూతన నగర కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నల్లగొండ జిల్లా సంఘటన మంత్రి ఎడ్ల నరేష్ తేజ  మాట్లాడుతూ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీలోని విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ మరియు నలుగురు విద్యార్థులతో ప్రారంభమైందని తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా విస్తరించి, లక్షలాది మంది విద్యార్థులను కలుపుకొని పనిచేస్తున్న అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఎదిగిందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, విద్యార్థులు దేశం గురించి ఆలోచించే విధంగా వారిని తీర్చిదిద్దడమే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థి సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక బాధ్యత, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి నూతన నగర కార్యవర్గాన్ని ప్రకటించి, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన నగర కార్యవర్గం నగర కార్యదర్శి: ఇస్లావత్ మహేష్ జాయింట్ సెక్రటరీలు: నూతనగంటి గణేష్, రామావత్ లక్ష్మణ్, రామావత్ అజయ్, ముష్టిపల్లి అజయ్, రోజా, కావేరి వైస్ ప్రెసిడెంట్లు: మౌనిక, మల్లీశ్వరి, శిరీష, కార్తీక్, మధు, అఖిల్ నగర గర్ల్స్ ఇన్‌చార్జ్: ఆర్. వాణి నగర స్టూడెంట్స్ ఫర్ సేవ (SFS): బి. శిరీష నగర క్రీడల కన్వీనర్: ఆర్. సిద్ధు ఈ కార్యక్రమంలో దమ్ము జమ్ముతీష్, చేపూరి కార్తీక్, ఐత రాజు కొండల్, రాహుల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ