అయిజ మున్సిపాలిటీ లో బిజేపి ని బారీ మెజారిటీతో గెలిపించాలి

బీజేపీ బలపడితే అయిజకు ప్రత్యేక నియోజకవర్గం ఖాయం: బిజేపి జిల్లా ఇన్‌చార్జ్ మర్రి బాపు రెడ్డి

WhatsApp Image 2026-01-27 at 4.24.31 PM

 

గద్వాల  : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ,  విద్యానగర్ కార్యాలయంలో  అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి,మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఇన్‌చార్జ్ మర్రి బాపు రెడ్డి,జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు, ఎన్నికల కన్వీనర్ ఎస్.రామచంద్ర రెడ్డి హజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అయిజ మున్సిపాలిటీలో రానున్న ఎన్నికలలో ఘనమైన మెజారిటీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ప్రతి వార్డులో బీజేపీ కౌన్సిలర్‌లను గెలిపించినట్లయితే, అయిజను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం చాలా సులభతరం అవుతుందని స్పష్టం చేశారు.అయిజ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన నియోజకవర్గ ఏర్పాటుపై ఇది వరకే అరుణమ్మ అయిజను ప్రత్యేక నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఆ హామీ అమలు కావాలంటే బీజేపీ మరింత బలంగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.అలాగే అయిజ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక అభివృద్ధి పనులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని అన్నారు.ప్రతి మున్సిపాలిటీ వార్డులో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గెలుపు అవకాశాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని స్క్రూటినీ కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే స్థానిక ఎన్నికలు అత్యంత కీలకమని, బీజేపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. అయిజ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా పని చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్లాలి అనే అంశాలపై కార్యకర్తలకు స్పష్టమైన మార్గదర్శనం చేశారు.మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి విశ్వాసం నింపాలని, అలాగే కాంగ్రెస్ , బిఆర్‌ఎస్ పార్టీలు ఇచ్చిన అమలు కాని హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కో కన్వీనర్ సంఘాల సంజీవరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భీమ్సేన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రదీప్ కుమార్, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బెల్లంకొండ నాగరాజు, మున్నూరు అశోక్, ఖుషి, వీరయ్య చారి, లక్ష్మణాచారి, బ్రహ్మయ్య చారి, భీమన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

7కేజీల గంజాయి పట్టివేత.. 7కేజీల గంజాయి పట్టివేత..
    ఖమ్మం  :  మొండికుంట నుండి అశ్వాపురం మార్గం లో ద్విచక్ర వాహనం పై తరలిస్తున్న  7 కేజీ ల  గంజాయి  తరలిస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ టీం
ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం.
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు! మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం
టీబీ వ్యాధిపై రోగులకు ఎక్స్ రే క్యాంపు
శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర)
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు.....జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి