ఆలోచించి ఓటు వేయండి.! అయిజ అభివృద్ధికి ఓటు వేయండి!! అయిజ కాంగ్రేస్ అద్యర్యంలో బారీ ర్యాలీలో పాల్గొన్న..... ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్

అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ కు ఓటు వేసినట్లయితే అది మురికి కాలువలో వేసినట్లే,ఎందుకంటే స్వయంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రకటించారు. మా పార్టీ అధికారంలో లేదు అని మాతో ఏ పనులు కావు అని వాళ్లే స్వయంగా అభివృద్ధి జరగదు అని చెప్పినా కూడా మనం బిఆర్ఎస్ కు ఓటు వేస్తే మన ఊరు అభివృద్ధికి దూరంగా అన్యాయమైపోతుంది.. ఆలోచించండి మిత్రులారా అని అన్నారు.సోమవారం అయిజ మున్సిపాలిటీలో ఏఐసిసి కార్యదర్శిమాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ అయిజ కాంగ్రేస్ పార్టీ 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో బారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి 2014 నుంచి రెండుసార్లు బిఆర్ఎస్ కి ఓటు వేసి అయిజ మున్సిపాలిటీలో అధికారం ఇచ్చారు. ఒకసారి అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ది చేసిచూపిస్తామని అన్నారు.ఒక్కసారి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి చూద్దాం, అభివృద్ధి చేస్తాం అన్నారు. అయిజ పట్టణ అభివృద్ధికి ఓటు వేద్దామా వద్దా అని మనమే ఆలోచించుకోవాలని అన్నారు.
అయిజ పట్టణ భవిష్యత్తు కోసం మనమంతా ఆలోచించవలసిన సమయం. ఊరికి ఉపకారం చేసే విధంగా మన ఆలోచనలు ఉండాలని పట్టణ ప్రజలను కోరారు అయిజ చిన్న పట్టణం కాస్త పెద్ద పట్టణంగా మారుతున్న సందర్భంలో అభివృద్ధి చాలా ముఖ్యం ఇక్కడకు రావలసిన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సదుపాయాలు అన్ని ఏర్పాటు చేస్తేనే పెద్ద పట్టణంగా మారుతుంది అని అయిజ పట్టణ ప్రజలు గమనించాలని తెలిపారు.అభివృద్ధి అనేది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది, అధికారంలో లేని వాళ్లకు ఓటు వేసి నష్టపోవడం కంటే అధికారంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అయిజ పట్టణ అభివృద్ధిని కోరుకుందాం అని విన్నవిచారు.చివరిగా వ్యక్తుల కంటే వ్యవస్థలు గొప్పవి, ఊరి అభివృద్ధి కోసం మనమంతా ఒక్కటై మంచి నిర్ణయం తీసుకోవలసిన సమయం, ఓటు వేసే ముందు ఒక్కసారి ఊరి అభివృద్ధి గురించి, మీ పిల్లల భవిష్యత్ ఆలోచించి నిర్ణయం తీసుకోని కాంగ్రేస్ పార్టి కి ఓటు వేసి వేయించి బారీ మేజర్టితో కాంగ్రేస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మేన్ నీలి శ్రీనివాసులు,వ్యవసాయ మార్కేట్ యార్డు చైర్మేన్ బింగిదోడ్డి దోడ్డేప్ప, కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,20వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు,పట్టణ ప్రజలు బారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

