ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తు చేసి, బాధితులకు అండగా నిలవండి ... జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు

గద్వాల : జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు, దర్యాప్తులో నాణ్యత, నేరాల నియంత్రణ అంశాలపై ఎస్పీ సమీక్షించారు. అలాగే ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పురపాలిక ఎన్నికలను పూర్తిగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ
ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై అందుబాటులో ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని తెలిపారు. అక్రమ గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలి అని తెలిపారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు అందించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు తరచూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.మండల కేంద్రాల్లో ట్రాఫిక్ పోలీసులను నియమించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, మద్యం సేవించి రాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని, ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు ఎలాంటి అడ్డంకులు లేకుండా అమలయ్యేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పి తెలిపారు. ఈ సందర్భమై పురపాలిక ఎన్నికలను 100 శాతం శాంతియుతంగా నిర్వహించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో బాగంగా ఎన్నికల సమయంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (యంసిసి) ఉల్లంఘనలపై కఠినంగా చర్యలు తీసుకోవడం, ఓటర్లను బెదిరింపులు, ప్రలోభాల నుండి రక్షించి స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడం, సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు, సున్నిత వార్డుల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు. నగదు, మద్యం, మత్తుపదార్థాల అక్రమ పంపిణీ, రవాణాను అడ్డుకోవడం. రౌడీషీటర్లు, కలహప్రియులపై నిఘా, ముందస్తుగా బైండోవర్ చర్యలు తీసుకొని ఎన్నికల ప్రశాంతతను కాపాడటం, పోలింగ్ కేంద్రాల్లో భద్రత కల్పించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటం వంటి అంశాలపై జిల్లా ఎస్పీ సూచనలు ఇవ్వడమైనది. ఓటింగ్ అనంతర భద్రత, కౌంటింగ్ కేంద్రాలు, ఫలితాల ప్రకటన సమయంలో కూడా పూర్తి భద్రత ఏర్పాటు పై అదికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్, డీఎస్పీ మొగిలయ్య, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టి. శ్రీను, వి. ప్రదీప్ కుమార్, టాటా బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అలాగే అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, జిల్లా కార్యాలయ ఎస్సైలు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


