రాజ్యాంగ విలువలే పోలీస్ మార్గదర్శకం క్రమశిక్షణ, నిబద్ధతే పోలీస్ బలం

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు

WhatsApp Image 2026-01-26 at 11.04.59 AM(1)

 

గద్వాల  : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ  రాజ్యాంగ విలువలే పోలీస్ శాఖకు మార్గదర్శకమని, క్రమశిక్షణ, నిబద్ధతే పోలీస్ బలమని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ ముందుగా గౌరవ వందనం స్వీకరించి, అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పతక ఆవిష్కరణ గావించారు.
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ జనవరి 26 భారతదేశ చరిత్రలో అత్యంత గర్వకారణమైన దినం. మన దేశ ప్రజలు తమకోసం తామే రచించుకున్న రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చుకున్న రోజు అని అన్నారు.  భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అతి ముఖ్యమైనది భారత రాజ్యాంగం. ఈరోజు మనమందరం కూడా ఇంత చక్కనైన వాతావరణంలో జీవించగలుగుతున్నాo అంటే  అది మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ఈ దినం ప్రతి భారతీయుడిలో బాధ్యత, కర్తవ్య భావనను మరింత బలపరుస్తుందన్నారు.
పోలీస్ శాఖ అనేది కేవలం విధులు నిర్వర్తించే వ్యవస్థ మాత్రమే కాదు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు సేవలందించే బాధ్యతాయుతమైన బలగం. జిల్లా పోలీస్ సిబ్బంది అందరూ క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.  భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత చేరువై, నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి” అని అన్నారు. అనంతరం జిల్లాలో వివిధ స్థాయిలలో విధులు నిర్వహిస్తూ  ఉత్తమ సేవలు అందించి అతిఉత్కృష్ట, ఉత్కృష్ట, సేవా పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులు, సిబ్బందికి పతకాలను ఎస్పీ అలంకరించారు. అలాగే జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ప్రతిభ ను కనబరిచిన అధికారులకు , పోలీస్ సిబ్బందికి కమాండేషన్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. కార్యక్రమం అనంతరం అధికారులు, సిబ్బందికి స్వీట్స్ పంపిణీ చేసి మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే శంకర్, గద్వాల్ డిఎస్పి వై మొగిలయ్య, ఏఆర్ డిఎస్పి టి నరేందర్రావు, కార్యాలయ ఓ బి సతీష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర రెడ్డి, గద్వాల్ సర్కిల్ ఆఫీసర్ టంగుటూరి శ్రీను, అలంపూర్ సర్కిల్ ఆఫీసర్ ప్రదీప్, జిల్లాలను వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు కార్యాలయంలోని   ఎస్సైలు,  పోలీస్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పండి   -- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పండి -- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
    మహబూబ్ నగర్  : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలి --- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
23 వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించిన స్వతంత్ర అభ్యర్థి మేస్త్రం వామన్
కాంగ్రెస్ తోనే ములుగు అభివృద్ధి....అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలి ..... అభివృద్ధి చేసే బాధ్యత నాది మంత్రి సీతక్క.
కాంగ్రెస్ లో చేరిన కుడియా తండా బిఆర్ఎస్ నాయకులు
బిజెపి నాయకుల అక్రమ అరెస్టు
అయిజ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి,ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్