నాగర్‌కర్నూల్ విద్యార్థికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం
విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సురేందర్
నాగర్ కర్నూలు : 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్ కర్నూల్ విద్యార్థి బండారి గణేష్ కాంస్య పతకం సాధించి జిల్లాకు గర్వకారణమయ్యాడు.
ఖమ్మం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో 3 కిలోమీటర్ల పరుగు పందెంలో గణేష్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థిగా గణేష్ కోచ్ రానా మల్లేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. గణేష్ విజయం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సురేందర్ విద్యార్థిని అభినందించారు. కోచ్ రానా మల్లేష్ ఆధ్వర్యంలో గణేష్ కు చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, గణేష్ విజయానికి తల్లిదండ్రుల సహకారం, నిరంతర సాధన కారణమని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించేలా మరింత కృషి చేస్తామని ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీస్తున్న లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ పై పలువురు ప్రశంసలు కురిపించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


