రైతులకు ఆర్థిక అక్షరాస్యత సదస్సు

రైతులకు ఆర్థిక అక్షరాస్యత సదస్సు

నల్లబెల్లి : మండలంలోని కొండాయిల్ పల్లి గ్రామంలో బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్  సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు ఆర్థిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ద్వారా అందించే వివిధ రుణాలు, బీమా పథకాలు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా 
బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ నాయక్ మాట్లాడుతూ.......పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాది లోపు రుణాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారా 7 శాతం వడ్డీ ప్రయోజనం పొందవచ్చని, అర్హత నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. సకాలంలో రుణాలను పునరుద్ధరించకపోతే వడ్డీ రాయితీ కోల్పోయే అవకాశం ఉందని వివరించారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో టీజీబీ సహస్ర ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ద్వారా 7.5 శాతం వరకు వడ్డీ పొందవచ్చని, వృద్ధులకు అదనపు వడ్డీ ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తదితర బీమా పథకాల వివరాలను వెల్లడించారు. ప్రమాద బీమా క్లెయిమ్‌లకు అవసరమైన పోలీస్ పంచనామా వంటి పత్రాలను సమర్పించాలని సూచించారు. ఎస్‌బీఐ లైఫ్, ఆరోగ్య బీమా పథకాలను కూడా బ్యాంకు ద్వారా పొందవచ్చని తెలిపారు.అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గలవారు చేరి, 60 ఏళ్ల తర్వాత నిబంధనల ప్రకారం నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చని వివరించారు. మహిళా సంఘాలు సకాలంలో రుణాలు చెల్లిస్తే అర్హతను బట్టి రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ముద్ర రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా భవిష్యత్తులో అధిక రుణాలకు అర్హత పొందవచ్చని తెలిపారు. వ్యాపార అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ రుణాలు, వ్యవసాయ భూమిపై మార్ట్గేజ్ రుణాలు పొందే అవకాశాలను వివరించారు.
ఏటీఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా వినియోగించుకోవాలని, ఓటీపీ నంబర్లను అపరిచితులకు వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా వినియోగించని బ్యాంకు ఖాతాదారులు ఆధార్, పాన్ లేదా ఇతర సంబంధిత పత్రాలతో కేవైసీ పూర్తి చేసి ఖాతాలను తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ శాఖాధికారి కృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ నాయక్, క్యాషియర్ భానుమూర్తి, గ్రామ సర్పంచ్ ఎరుకల స్వప్న–నరేష్ రెడ్డి, గ్రామపంచాయతీ పెద్దలు, వీఓఏ వెంకటేశ్వర్లు, నల్లబెల్లి బ్యాంక్ మిత్ర సుధగాని ప్రమోద్, గ్రామ రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్