దళిత ఆత్మగౌరవానికి దక్కిన గుర్తింపు...

IMG-20260715-WA1756(1)
 
- అద్దంకి దయాకర్‌కు మంత్రి హోదాపై హర్షం
చర్ల ,(భద్రాద్రి కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో అద్దంకి దయాకర్‌కు మంత్రి హోదా లభించినందుకు ఘనంగా సంబరాలు నిర్వహించారు, ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్‌కు తెలంగాణ ప్రభుత్వం మంత్రి హోదా కల్పించడం దళితులకు, తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గొప్ప గౌరవమని జాతీయ మాల మహానాడు జిల్లా నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో, దళితుల హక్కుల కోసం అద్దంకి దయాకర్ చేసిన సుదీర్ఘ పోరాటాలను గుర్తించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి హోదా కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు, ఇది రాష్ట్రంలోని కోట్లాది మంది దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కీలక అడుగు అని కొనియాడారు. 
 
IMG-20260715-WA1754(1)
 
జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి గణపతి మాట్లాడుతూ అద్దంకి దయాకర్ నాయకత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దళిత ప్రాంతాల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఎస్సీ కార్పొరేషన్ మరియు గురుకులాలకు మరింత నిధులు అందుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్ మాట్లాడుతూ అసెంబ్లీలో దళితుల గొంతుకగా నిలిచిన నాయకుడికి మంత్రి హోదా లభించడం ఉద్యమకారులకు పండగ లాంటిదని సంతోషం వ్యక్తం చేశారు, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా కమిటీ సభ్యులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అద్దంకి దయాకర్‌కు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
Views: 91

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత