చర్ల పోలీస్ స్టేషన్‌లో భద్రాచలం ఎస్ డి పి ఓ వార్షిక తనిఖీలు

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

చర్ల పోలీస్ స్టేషన్‌లో భద్రాచలం ఎస్ డి పి ఓ వార్షిక తనిఖీలు

చర్ల : చర్ల పోలీస్ స్టేషన్‌ను భద్రాచలం ఎస్‌డీపీఓ మంగళవారం వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు, ఈ సందర్భంగా స్టేషన్ సాధారణ నిర్వహణతో పాటు స్టేషన్ రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, కేస్ డైరీలు మరియు పెండింగ్ దర్యాప్తు ఫైళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు,అనంతరం పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు, దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను సకాలంలో పరిష్కరించేలా సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారుప్రజలతో సమన్వయం.. అసాంఘిక శక్తులపై నిఘా!

ఈ సందర్భంగా ఎస్‌డీపీఓ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని పిలుపునిచ్చారు, నిరంతర గస్తీ (పెట్రోలింగ్) ఏర్పాటు చేయడంతో పాటు అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రజలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు,
పోలీస్ సిబ్బంది వృత్తిపరమైన క్రమశిక్షణ పాటించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు స్టేషన్‌కు వచ్చే ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, బాధితులకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు, సిబ్బంది అంకితభావం, వృత్తి నైపుణ్యం మరియు ప్రజాసేవ పట్ల నిబద్ధతతో విధులు నిర్వహించాలని కోరారు,ఈ తనిఖీ కార్యక్రమంలో చర్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాజు వర్మ, ఎస్ ఐ నర్సిరెడ్డి తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.
ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు*
3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్