దోస్తానా కుస్తినా టికెట్ ఎవరిది? జెండా పాతేదేవరు? -తేలని పొత్తుల పంచాయతీ -కొత్తగూడెంలో అయోమయంలో రాజకీయం!

కొత్తగూడెం : కొత్తగూడెం రాజకీయ వాతావరణం ఈసారి విచిత్రమైన సందిగ్ధంలో చిక్కుకుంది. నామినేషన్ ప్రక్రియ పూర్తయినా,ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు,ఎవరికీ టికెట్ ఖరారైంది అనే ప్రాథమిక ప్రశ్నలకే సమాధానం లేని పరిస్థితి నెలకొంది.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ స్పష్టత రావాల్సిన చోట అయోమయం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా సీపీఐ–కాంగ్రెస్ పొత్తు అధికారికంగా తేలకపోవడం ఈ గందరగోళానికి ప్రధాన కారణంగా మారింది.టికెట్ ఏ పార్టీ నుంచి వస్తుందో తెలియక ఆశావాహులు మూడు,నాలుగు నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఒకే వ్యక్తి అన్ని పార్టీల నుంచి నామినేషన్లు వేయడం రాజకీయ వ్యూహమా? లేక వ్యవస్థ వైఫల్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలంటే ప్రజల్లోకి వెళ్లాలి వాళ్ళ సమస్యలు వినాలి,పరిష్కారాలపై మాట్లాడాలి.కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది.ప్రచారం చేయాల్సిన సమయం వచ్చినా ఏ పార్టీ జెండా పట్టుకోవాలో తెలియక అభ్యర్థులే సతమతమవుతున్నారు.ఇది కేవలం అభ్యర్థుల సమస్య కాదు ప్రజలకు అందాల్సిన రాజకీయ స్పష్టతకు అడ్డంకిగా మారింది.ఇదే సమయంలో పార్టీల వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. ఎవరికి టికెట్ ఇస్తున్నారో చివరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచడం ద్వారా ఉత్కంఠను పెంచుతున్నారు.చివరకు బీ–ఫారం ఎవరికీ వస్తుందో అన్నది తేలే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి.ఈ ప్రక్రియలో ఎంతమంది ప్రజాప్రతినిధులు అవుతారో,ఎంతమంది ఆశావహులు ఆర్థికంగా నష్టపోతారో కూడా ప్రశ్నార్థకమే.
ఇలాంటి వేళ ప్రజలు ఒక విషయం గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.డబ్బు,బలగాలు,పొత్తుల గణితం కంటే ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు వచ్చే వారినే గుర్తించాల్సిన సమయం ఇది. రాజకీయ పార్టీల గందరగోళం మధ్య ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలి.టికెట్లు ఖరారైన తర్వాత మిగిలే కొద్ది రోజుల్లో అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి నమ్మకం కల్పించగలిగి సమస్యలపై అవగాహన చూపగలరా అన్నదే అసలు పరీక్ష.ఎన్నికల సమయం తక్కువగా ఉన్న ఈ తరుణంలో,నిజంగా ప్రజలతో మమేకమై,ప్రజాస్వామ్య విలువలకు నిలబడి పనిచేసేవారికే ప్రజల మద్దతు లభిస్తుంది.ఎన్నికలు కేవలం గెలుపు–ఓటముల కోసం కాదు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే పరీక్షగా మారాల్సిన అవసరం ఉందనీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కొత్తగూడం రాజకీయం మరింత వేడనక్కుంది చివరికి పీఠం ఎవరికి దక్కుతుందో మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

