కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ.

టేకులపల్లి : 77 గణతంత్ర దినోత్సవం సందర్బంగా టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరణ చేసారు. మండల అధ్యక్షులు దేవా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ హాజరు హాజరయ్యారు.1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, మనకంటూ ఒక సొంత చట్టం, ఒక రాజ్యాంగం ఏర్పడింది మాత్రం 1950 జనవరి 26న. ఆ రోజునే మన దేశం పూర్తిస్థాయి 'గణతంత్ర రాజ్యంగా' అవతరించింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజును మనం ఎంతో గర్వంగా జరుపుకుంటాం. గణతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు.. బాధ్యతలు కూడా! దేశాభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయి. నేటి యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తూ, అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలి. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు, దేశానికి వెన్నెముకైన రైతులకు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మనం సెల్యూట్ చేద్దాం. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

