ఎత్తి పోతల ఉత్తి పోతల? _నిరుపయోగంగా ఉన్నఎత్తిపోతల పథకాలు

నీరున్నా ఉపయోగించుకోలేని దుస్థితి -మరమ్మత్తులను పట్టించుకోని పాలకులు


WhatsApp Image 2026-01-30 at 9.25.51 AM

 

కొమరం భీం ఆసిఫాబాద్ : ఆరు నెలలు శ్రమించే అన్నదాత కు కన్నీటి వేదనే మిగులుతోంది. చెమట చుక్కలు చిందించి సాగుచేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండడం లేదు. ప్రకృతి పగబడుతున్నప్పుడల్లా సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా ఉండగా ఏటా రైతులు వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోతే పంటలు ఎండిపోతుండగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎత్తిపోతల పథకాలు వినియోగంలో లేక ఇబ్బందులు పడుతున్నారు.

గాలికొదిలేసిన ప్రభుత్వాలు కొమరం భీం జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు నిధుల లేక గత ప్రభుత్వాలు కూడా ఎత్తిపోతల పథకాలను గాలి కొదిలేశాయి. జలవనరుల నుంచి పంటలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదుల వద్ద నిర్మించిన ఎత్తి పోతల పథకాలు ఆయకట్టుకు చుక్కనీరందించడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం కలుగడం లేదు. కొన్ని ఎత్తి పోతల పథకాల పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండగా మరి కొన్ని మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి.దింతో రైతులకు సాగు నీటికి కష్టాలు తప్పడం లేదు జీవ నదిగా చెప్పుకునే ప్రాణహిత, పెన్ గంగాల పై కౌటాల, సిర్పూర్ (టి), చింతల మానేపల్లి మండలాల్లో 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కౌటాల మండలం లోని సాండ్ గాం,తుమ్మడి హెట్టి, వీర్దండి, గుండాయి పేట్, సిర్పూర్ (టి) మండలం లో హుడ్కుల్లి, చింతల మానేపల్లి మండలం కోర్సిని, గూడెం, రన్ వెళ్లి పూర్తి అయి నిరూపయోగంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం వీటి పైన ద్రుష్టి సారిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.


-    10 వేల ఎకరాలకు. కౌటాల మండలంలో 10వేల ఎకరాలకు ప్రాణహిత జలాలను పొలాలకు అందించేందుకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్ల కిందట తుమ్మిడిహెట్టి, వీర్దండి, గుండాయిపేట, సాండ్‌గాం ఎత్తి పోతల పథకాలు నిర్మించారు. ఇవి కొన్ని రోజు పాటు ఆయకట్టు పొలాలకు నీరందించినప్పటికీ మోటార్లు చెడి పోవడంతో అవి ఉపయోగం లేకుండా మారింది దీంతో అన్నదాతల ఆశలు అడియా శలయ్యాయి. చింతలమానేపల్లి మండలంలో ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంతో కోర్సిని వద్ద నిర్మిస్తున్న ఎత్తి పోతల పథకం పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడక పనులు కొనసాగుతున్నాయి. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ పథకం నేటికి పూర్తి కాలేదు. గూడెం, రనవెల్లి ఎత్తిపోత పథకాలు సైతం నేటికి పూర్తి కాక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి ఎత్తి పోతల పథకాలకు నిధులు కేటాయించి ఉపయోగంలోకి తీసుకరావాలని ఆయకట్టు దారులు కోరుతున్నారు.

ఆందోళనలో అన్నదాతలు కౌటాల మండలం సాండ్ గాం గ్రామ శివారులోని పెన్ గంగా నది సమీపంలోగల ఎత్తిపోతల పథకం. ఈ సాండ్గాం ఎత్తిపోతల పథకాన్ని 2009లో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించారు. దాదాపు 10 యేండ్లు 2 పంటలకు నీరు అందించిన ఈ ఎత్తి పోతలకు నిర్వహణ సరిగా లేక అయిదు యేండ్లు గా వినియోగంలో లేదు. దీంతో రైతులకు సాగునీరు అందడం లేదు. ఇది నిరుపయోగంగా మారడం తో సమీప గ్రామాలైన, సాండ్ గాం, కౌటి, పార్డి, కుంబారి, వీరవెల్లి, లోనవేల్లి గ్రామాలకు  ఒక పంట కూడా బోర్ల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది 2 పంటలు పండిద్దాం అంటే భూ గర్భ జలాలు తగ్గి బోర్లు కూడా సరిగ్గా పోయడం లేదు ఇక జిల్లా జిల్లాలో ఎత్తిపోతల పథకాల కింద భూములను సాగు చేస్తున్న ఆయకట్టు దారుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు పూర్తికాక పోవడంతో పంట పొలాలకు చుక్కనీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు వెచ్చించి పథకాలు ప్రారంభించినా అవి పూర్తి కాకపోవడంతో వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పుష్కలంగా జల వనరులున్నా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఎత్తి పోతల పథకాలు పూర్తి కాకపోవడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేపడితే ఈ ప్రాం తంలో రెండు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతకు ముందు రెండు పంటలు పండించే వాళ్ళం సాండ్ గాం ఎత్తి పోతల పథకం వలన మా గ్రామం మొత్తం ఇంతకు ముందు రెండు పంటలు పండించే వాళ్ళం ఇప్పుడు కనీసం ఒక పంటకు కూడా మేము ఆయిల్ ఇంజన్, బోరవెల్ పై ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది. రెండవ పంట  కు బోర్లు సరిగ్గా పోయక భూ గర్భ జలాలు తగ్గి నీరు సరిగ్గా పోయడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం  స్పందించి వీటికి మరమ్మతులు చేపట్టాలి.

WhatsApp Image 2026-01-30 at 9.25.51 AM(1)

 

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మద్యం సేవించి డ్రైవింగ్ చేసినవారికి 146 మంది మందుబాబులకు ఒకరోజు జైలు శిక్ష  - ఎస్పీ ఎం రాజేష్ చంద్ర మద్యం సేవించి డ్రైవింగ్ చేసినవారికి 146 మంది మందుబాబులకు ఒకరోజు జైలు శిక్ష - ఎస్పీ ఎం రాజేష్ చంద్ర
    కామారెడ్డి   :  మద్యం తాగి డ్రైవ్ చేస్తే భవిష్యత్తే ప్రమాదం అని 146 మందికి కోర్టు శిక్షలు, 13 మందికి ఒక రోజు జైలు శిక్ష!
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు: బలుస సతీష్
సీఎం కప్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నారాయణ పాఠశాల విద్యార్థిని
వర్గ పోరు కొంపముంచింది? -గెలువాల్సిన సీట్లను కోల్పోయింది.
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ --జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సరోజిని నాయుడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి... ప్రధానోపాధ్యాయులు నీరజ...
చిన్నారుల రక్షణ ప్రభుత్వాల లక్ష్యం...