తెలంగాణ విద్యా విధానం -2026 ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు :- బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF)

WhatsApp Image 2026-02-28 at 4.27.39 PM

 

ఆదిలాబాద్ :  తెలంగాణా విద్యా వ్యవస్థపై విద్య కమిషన్ రూపొందించిన ఎడ్యుకేషన్ పాలసీ సర్జికల్ స్ట్రైక్ చేయడమే అవుతుంది అని బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గడుగు మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని విద్యా పాలసీ సిఫారసులను పునఃపరిశీలన చెయ్యాలని కోరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ (ఆకునూరి మురళి కమిటీ) సమర్పించిన నివేదికను  తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు . ఈ నివేదిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర తప్ప మరొకటి కాదు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన కమిషనే, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం శోచనీయం అని అన్నారు. విద్యా హక్కు చట్టం ఖూనీ, 'మూడు గ్రామాలకు ఒకే బడి' అంటే అర్ధం ఏమిటి? పేద బిడ్డలను బడికి దూరం చేయడమే కదా? ఆర్ టి ఈ-2009 స్ఫూర్తిని తుంగలో తొక్కే హక్కు ఈ కమిషన్కు ఎవరిచ్చారు? ఉపాధ్యాయుల శ్రమకు వెల కడతారా? మార్కెట్ రేట్లతో ఉపాధ్యాయుల వేతనాలను పోల్చడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుంటోంది. విద్యా నాణ్యత పెరగాలంటే నియామకాలు జరగాలి కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులతో వ్యవస్థను బానిసత్వంలోకి నెట్టకూడదు అని చెప్పారు. పదోన్నతులపై గొడ్డలి పెట్టు: ఉపాధ్యాయులకు పదోన్నతులు సీనియారిటీ ద్వారా కాకుండా పారామీటర్ల ద్వారా ఇవ్వాలి అనడం అర్థరహితం మరియు సర్వీస్ రూల్స్ కు పూర్తి గా వ్యతిరేకం. దశాబ్దాల తరబడి సర్వీసులో ఉండి, హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందాలని ఎదురుచూస్తున్న స్కూల్ అసిస్టెంట్ల ఆశలపై 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన నీళ్లు చల్లుతోంది. ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయ వర్గానికి నష్టమే! ఆర్థిక అణచివేత ఏ ఏ ఎస్: 6/12/18/24 ఏళ్ల స్కేళ్లను బడ్జెట్ భారంగా చూడటం దుర్మార్గం. మానసిక వేధింపులు, పనివేళల పేరుతో, నివాస పరిమితుల పేరుతో ఉపాధ్యాయులను కట్టడి చేయాలనుకోవడం అప్రజాస్వామికం. సాయంత్రం 6:30 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహించాలనడం, ఉపాధ్యాయులు పనిచేసే గ్రామం లేదా 15 కి.మీ పరిధిలోనే నివాసం ఉండాలన్న నిబంధనల వలన నాణ్యత పెరగదు. మౌలిక వసతులు లేని బడుల్లో ఒత్తిడి పెంచి నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారు? ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతిపాదన అనవసరమైన వివాదాలకు దారి తీస్తుంది.  "విద్యా కమిషన్ నివేదికను ప్రభుత్వం తక్షణమే బుట్టదాఖలు చేయాలి. ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. బడుల బలోపేతం, ఉపాధ్యాయుల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా మొండిగా ముందుకెళ్తే BTF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉ ద్యమం తప్పదని వారు హెచ్చరించారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శాస్త్ర విజ్ఞానానికి వేదికగా గురుకుల కళాశాల… శాస్త్ర విజ్ఞానానికి వేదికగా గురుకుల కళాశాల…
    కొత్తగూడెం : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా   కళాశాల కొత్తగూడెం , పాల్వంచ లో శనివారం నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో జాతీయ
అందరికీ ఆరోగ్య రక్ష, ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్ ప్లాన్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్
అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
సైన్స్‌అండ్‌ టెక్నాలజీలో విద్యార్థులు ముందుండాలి - మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి
ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఆన్లైన్ ద్వారానే రైతులకు యూరియా విక్రయం చేయాలి... నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు, వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు... ఏవో వెంకట్:
విద్యా కమిషన్ రిపోర్టును వ్యతిరేకించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన..