మున్సిప‌ల్ వార్డుల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ ఒక్క‌రోజులో 19 వార్డుల‌లో ప్ర‌చారం

WhatsApp Image 2026-02-09 at 4.20.14 PM

 

ఆదిలాబాద్ :  మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆదిలాబాద్ కాంగ్రెస్  పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి దూసుకుపోతున్నారు. కాల‌నీల‌లో సుడిగాలిలా ప‌ర్య‌టిస్తున్నారు.ప్ర‌చారానికి చివ‌రి రోజైన సోమ‌వారం ఆయ‌న ఏకంగా 19వార్డుల‌ను చుట్టేసారు.ఆయా కాల‌నీల‌లో నిర్వ‌హించిన రోడ్ షోల‌లో వార్డ్ ప్ర‌జ‌ల నుద్దేశించి  ప్ర‌సంగించారు.కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే అభివృద్ధి చేసింది ఇంకా చేస్తుంద‌న్నారు.పేద‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చింద‌న్నారు.మ‌హిళ‌లు ప్ర‌జ‌లు చాలా ఆనందంగా ఉంద‌న్నారు.ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రెండు వంద‌ల యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ , ఐదు వంద‌ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, కొత్త రేష‌న్ కార్డులు , స‌న్న‌బియ్యం పంపిణీ లాంటివి మ‌హిళ‌ల‌కు వ‌రాల‌న్నారు.ఇంకా  ప్ర‌తీ మ‌హిళ‌కు ఆర్థిక చేయూత కింద నెల‌కు 2500 ప‌థ‌కం త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌న్నారు. వార్డులలో స‌మ‌స్య‌లు తీరాలంటే , ఆదిలాబాదం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆత్మ కమిటీ చైర్మన్  సంతోష రావు,కొండా గంగాధర్,లోక ప్రవీణ్ రెడ్డి, శాంతన్ రావు,  వామన్ వాంఖ‌డే, రాందాస్ నాక్లే, అల్లూరి భూమారెడ్డి, మామిడి మల్లారెడ్డి, అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News